- ఒక్క వారంలో 14 బిలియన్ డాలర్లకు పైగా క్షీణత
న్యూఢిల్లీ : భారత విదేశీ మారక నిల్వలు అమాంతం పడిపోయి.. మూడు వారాల కనిష్టానికి పతనమయ్యాయి. నవంబర్ 13తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు 14 బిలియన్ డాలర్లకు పైగా క్షీణించి 705.342 బిలియన్ డాలర్లకు దిగివచ్చినట్లు ఆర్‌బిఐ గణాంకాలు వెల్లడించాయి. విదేశీ కరెన్సీ నిల్వల విలువ తగ్గడం ఈ క్షీణతకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. విదేశీ మారక నిల్వల్లో అత్యధిక వాటా కలిగిన విదేశీ కరెన్సీ ఆస్తులు 591.350 బిలియన్ డాలర్ల నుంచి 583.452 బిలియన్ డాలర్లకు తగ్గాయి. బంగారం నిల్వల విలువ కూడా 104.796 బిలియన్ డాలర్ల నుంచి 98.613 బిలియన్ డాలర్లకు దిగివచ్చింది. అంతర్జాతీయ కరెన్సీల మారక విలువల్లో మార్పులు, బంగారం ధరల హెచ్చుతగ్గులు నిల్వల విలువపై ప్రభావం చూపుతాయి.







కామెంట్‌లు (0)