నేపాల్-ఎపై 306 పరుగుల తేడాతో ఇండియా-ఎ గెలుపు
దోహా: ఎసిసి పురుషుల ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత్-ఎ జట్టు శుభారంభం చేసింది. గ్రూప్-బిలో శుక్రవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో నేపాల్-ఎపై 306 పరుగులు తేడాతో తేడాతో భారత్-ఎ ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-ఎ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 332 పరుగుల భారీస్కోర్ చేసింది. కుషగ్ర(117; 102బంతుల్లో 10ఫోర్లు, 5సిక్సర్లు), తిలక్ వర్మ(107; 113బంతుల్లో 6ఫోర్లు, 4సిక్సర్లు) ధనా ధన్ ఇన్నింగ్స్‌తో మెరిసారు. వీరిద్దరూ 4వ వికెట్‌కు 206పరుగులు జతచేశారు. చివర్లో సుయాంశ్ షెడ్జే(36నాటౌట్) బ్యాటింగ్‌లో రాణించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్-ఎకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ(26), అభిషేక్ శర్మ(9), ఆయుష్ బడోనీ(2) నిరాశపరిచారు. దీంతో 42పరుగులకే 3వికెట్లు కోల్పోయి ఇండియా-ఎ కష్టాల్లో పడింది. ఆ దశలో కెప్టెన్ తిలక్ వర్మ, కుమార్ కుషగ్ర సెంచరీలతో రాణించారు. నేపాల్-ఎ బౌలర్లు రాజ్ భన్షీ, కెప్టెన్ లామిఛానేకు మూడేసి, నందన్ యాదవ్‌కు రెండు, పవన్ షరాఫ్‌కు ఒక వికెట్ దక్కాయి. అనంతరం నేపాల్ జట్టు 11.3ఓవర్లలో 26 పరుగులకే ఆలౌటైంది. ప్రిన్స్ యాదవ్(5/6), హర్షిత్ రాణా(4/16), షాబాజ్‌కు ఒక వికెట్ దక్కాయి. నేపాల్ జట్టులో ఐదుగురు డకౌట్ కాగా.. పవన్(6), రషీద్(6) టాప్ స్కోరర్స్. 22న పాకిస్తాన్-ఎతో భారత్ తలపడనుంది.
స్కోర్‌బోర్డు(సంక్షిప్తంగా)...
ఇండియా-ఎ : 332/9(50 ఓవర్లలో) కుషగ్ర(117), తిలక్(107); లమిఛానే(3/61), రాజ్‌బన్షీ(3/61). నేపాల్-ఎ : పవన్(6), రషీద్(6); ప్రిన్స్ యాదవ్(5/6), హర్షిత్ రాణా(4/14)







కామెంట్‌లు (0)