శుక్రవారం, 20 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వీసా, మాస్టర్‌కార్డ్‌ ఖాతాదారుల డేటా లీక్‌

1 గంట క్రితం

sdar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 12:53 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- డార్క్‌ వెబ్‌‌లో వేల మంది సమాచారం

వాషింగ్టన్‌ : ప్రముఖ అంతర్జాతీయ చెల్లింపుల సంస్థలు వీసా, మాస్టర్‌కార్డ్‌, అమెరికాకు చెందిన జెపి మోర్గాన్‌ ఛేజ్‌ ఖాతాదారులకు సంబంధించిన కీలక సమాచారం సైబర్‌ దాడిలో లీక్‌ అయ్యింది. ఈ సంస్థలకు సేవలందించే థర్డ్‌పార్టీ సంస్థపై హ్యాకర్లు దాడి చేసి సమాచారాన్ని సేకరించిన అనంతరం డార్క్‌ వెబ్‌లో విడుదల చేశారు. ఆయా సంస్థలు 48 గంటల్లో తమకు సొమ్ము చెల్లించాలని హ్యాకింగ్‌ ‌గ్రూప్‌ ‌డిమాండ్‌ను విస్మరించడంతో డేటాను లీక్‌ చేసినట్లు సైబర్‌ భద్రతా సంస్థలు వెల్లడించాయి. ​తమకు సేవలందించే థర్డ్‌పార్టీ సంస్థలపై సైబర్‌ దాడి జరిగిందని జెపి మోర్గాన్‌ తెలిపింది. దాడి చేసినవారు ఆ సంస్థల వద్ద ఉన్న మార్కెటింగ్‌ సమాచారాన్ని యాక్సెస్‌ చేసి ఉండవచ్చని బ్యాంకు పేర్కొంది. ఇందులో కొంతమంది ఖాతాదారుల పేర్లు, ఇమెయిల్‌ చిరునామాలు ఉండే అవకాశం ఉందని తెలిపింది. అయితే జెపి మోర్గాన్‌ ఖాతాదారులకు సంబంధించిన సుమారు 16,000 ఇమెయిల్‌ చిరునామాలు లీకైన డేటాలో ఉన్నట్లు హ్యాకర్లు పేర్కొన్నారు. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతానికి చెందిన ఒక సేవలందించే సంస్థపై జరిగిన దాడి గురించి తమకు సమాచారం ఉందని వీసా సంస్థ తెలిపింది. తమ పరిమిత సంఖ్యలో కార్డుదారులకు సంబంధించిన చెల్లింపేతర సమాచారం బయటపడినట్లు మాస్టర్‌కార్డ్‌ తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్