ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ దీక్ష కు కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జాల సుమంత్, వీరపోగు రవి
ప్రజాశక్తి కడప అర్బన్ : కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్‌ఐ వినూత్నంగా నిరసన తెలిపింది. శుక్రవారం ఎస్ఎఫ్ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద కళ్ళకు నల్ల రిబ్బన్ కట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. నీట్ పేపర్ లీకేజీ కి భాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, 18 రోజులుగా ఢిల్లీ లో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ ఆమరణ నిరాహార దీక్ష కు కేంద్ర ప్రభుత్వం స్పందించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జాల సుమంత్, వీరపోగు రవి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హయంలో వరుసగా పేపర్ లీకేజీలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఎన్‌టిఎ అసమర్థత స్పష్టంగా కనపడుతుందని చెప్పారు. బీజేపీ జేబు సంస్థలాగా పని చేస్తుందని విమర్శించారు. ఎన్నో వేల, లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రుల కలను నిరాశ కలిగించేలా చేశారన్నారు. పేపర్ లీకేజీ వల్ల 10 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఇవన్ని కేంద్ర ప్రభుత్వ హత్యలే అన్నారు. నీట్ పేపర్ లీకేజీ కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. 18 రోజులుగా పర్యావరణవేత్త సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకపోవడం దారుణమన్నారు. సోనమ్ వాంగ్ చుక్‌కి ఏం జరిగినా దానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రమాదకర స్థితిలో ఉన్నదని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి ఆయనతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా, రాష్ట్ర, దేశవ్యాప్తంగా వేల మంది విద్యార్థులతో కేంద్ర విద్యా శాఖ మంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అభినయ్, నగర కార్యదర్శి అఖిలేష్, ఉపాధ్యక్షులు హరిబాబు, కార్తీక్, నాని, నగర నాయకులు నరసింహ, ప్రసాద్, అభిషేక్ పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)