అధికారులకు సిపిఎం, రైల్వే అండర్ బ్రిడ్జి సాధన కమిటీ నేతల విజ్ఞప్తి
ప్రజాశక్తి- కడప అర్బన్ : ఎర్రముక్కపల్లి - విశ్వనాధపురం మధ్య పెండింగ్లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేయాలని సిపిఎం నగర కార్యదర్శి రామమోహన్, రైల్వే అండర్ బ్రిడ్జి సాధన కమిటీ కన్వీనర్ రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని విశ్వనాధపురం వద్ద బ్రిడ్జి స్థల సేకరణకు సర్వే చేస్తున్న ఆర్ అండ్ బి, రెవెన్యూ అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న బ్రిడ్జి పూర్తి కాకపోవడం వల్ల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి ఆర్ అండ్ బి, రెవెన్యూ అధికారులు కేవలం సర్వేలకే పరిమితం కాకుండా భూసేకరణ పరిహారం చెల్లించి, తక్షణమే పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆర్ అండ్ బి అధికారులు నివేదికను వెంటనే రెవెన్యూ అధికారులకు అందజేసి పరిహారం చెల్లించేలా కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. రానున్న వర్షాకాలంలో విద్యార్థులకు, వృద్ధులకు, మహిళలకు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా సంబంధిత కాంట్రాక్టర్ ద్వారా పనులు వెంటనే ప్రారంభం చేయాలని కోరారు. కార్యక్రమంలో రైల్వే అండర్ బ్రిడ్జి సాధన కమిటీ నాయకులు దస్తగిరిరెడ్డి, వీరబ్రహ్మం, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)