ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో చేపట్టిన సైనిక ఆపరేషన్‌లో 24మంది ఉగ్రవాదులు మరణించారు. నిఘా సమాచారం ఆధారంగా వరుస ఆపరేషన్‌లు చేపట్టినట్లు సైన్యం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. బన్ను జిల్లా, దాని పరిసర ప్రాంతాల్లో గత 24 గంటలుగా ఈ ఆపరేషన్లు కొనసాగాయని సైనిక దళాల మీడియా విభాగం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఆపరేషన్లలో 24 మంది ఉగ్రవాదులు మరణించారని, వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఆ ప్రకటన తెలిపింది. పలు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నారని, ప్రజల మృతికి కారణమయ్యారని పేర్కొంది. విజయవంతమైన ఆపరేషన్లు చేపట్టిన సైనికులను ప్రశంసిస్తూ పాకిస్తాన్ ప్రధాని అసిఫ్ అలి జర్తారీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
పాకిస్తాన్‌లో సైనిక ఆపరేషన్‌లో 24మంది ఉగ్రవాదుల మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 17, 2026, 05:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)