ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

వేతనాల పెంపు కోసం గర్జించిన కార్మికులు

2 రోజుల క్రితం

visakha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 30, 2026, 11:56 పూర్వాహ్నం | 7 నిమిషాల చదవడం

- 5 ఏళ్లుగా కనీస వేతనాల సవరణ నిలిపివేత కార్మికులపై తీవ్ర అన్యాయం

- రూ 26 వేల కనీస వేతనం అమలు చేయాలి

- సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, కలెక్టరేట్‌కు ర్యాలీ

ప్రజాశక్తి-యంత్రాంగం : రాష్ట్రంలోని 66 రంగాల్లో ప్రైవేట్ యాజమాన్యాల వద్ద పనిచేస్తున్న 50 లక్షల మంది కార్మికులకు చట్టబద్ధంగా ప్రతి ఐదేళ్లకోసారి అమలు చేయాల్సిన కనీస వేతనాల సవరణను వరుస ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు కదంతొక్కారు. వినతిపత్రం సమర్పించేందుకు కలెక్టరేట్లకు ర్యాలీలు నిర్వహించారు. పలు జిల్లాలో పోలీసులు ర్యాలీలను అడ్డుకొని , కార్మిక సంఘాల నాయకులను అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ 2012, 2017, 2022 సంవత్సరాల్లో జరగాల్సిన కనీస వేతనాల సవరణను అమలు చేయకుండా కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలతో పాటు ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా యజమానులకు వేల కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూర్చి కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. ఫలితంగా ప్రస్తుతం హెల్పర్, ఆఫీస్ బాయ్, అన్స్కిల్డ్ కార్మికుల కనీస వేతనం వీడీఏతో కలిపినా నెలకు రూ.12 వేల నుంచి రూ.13 వేల మధ్యనే కొనసాగుతుందన్నారు. చట్టం ప్రకారం ప్రతి ఐదేళ్లకోసారి వీడీఏను బేసిక్ వేతనంలో విలీనం చేసి 15 నుంచి 20 శాతం వరకు వేతనాలు పెంచి ఉంటే ప్రస్తుతం కనీస వేతనం రూ.19 వేల నుంచి రూ.22 వేల వరకు ఉండేదని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో కార్మికుల జీవన వ్యయం గణనీయంగా పెరిగిందని, వీడీఏ మాత్రమే ఆ భారాన్ని పూర్తిగా భర్తీ చేయలేదన్నారు. కుటుంబ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఐదేళ్లకోసారి వేతనాల సవరణ తప్పనిసరిగా చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు రూపొందించడం కార్మిక హక్కులకు విఘాతం కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు విజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కనీస వేతనాల పెంపు పూర్తి స్థాయిలో న్యాయం చేయకపోయినా, కర్ణాటక ప్రభుత్వం సుమారు 60 శాతం వరకు వేతనాలు పెంచి అన్స్కిల్డ్ కార్మికులకు రూ 20,350 నుంచి రూ 24,407 వరకు కనీస వేతనాలు అమలు చేస్తుందని గుర్తు చేశారు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా కనీస వేతనాలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

1957లో జరిగిన 15వ భారత కార్మిక మహాసభ తీర్మానం, 1992 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కార్మికుల జీవన అవసరాలకు అనుగుణంగా కనీస వేతనాలు నిర్ణయించాలని పేర్కొన్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కనీస స్థాయి కార్మికునికి నెలకు రూ 26 వేల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో పాటు యాజమాన్యాలు కూడా కార్మికులను మోసం చేస్తున్నాయని, 6 నెలలకోసారి చెల్లించాల్సిన వీడీఏ, 8 గంటలకు మించి పనిచేస్తే ఇవ్వాల్సిన రెట్టింపు వేతనాలు అమలు చేయకుండా కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు. కార్మిక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, కనీస వేతనాల పెంపు కోసం నిర్వహిస్తున్న ఉద్యమాల్లో అన్ని రంగాల కార్మికులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.


కనీస వేతనం 26 వేలు చేయాలని సీఐటీయు ధర్నా

ప్రజాశక్తి - కాకినాడ : రాష్ట్రంలోని అన్ని రంగాల కార్మికులకు నెలకు కనీస వేతనం 26 వేలు అమలు చేయాలని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ (ఎంటీఎస్) కల్పించి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం పిఠాపురం రాజా సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్‌కు వినతిపత్రం సమర్పించారు. సమస్యల పరిష్కారంపై సంబంధిత శాఖ అధికారులతో 10 రోజుల్లో సమావేశం ఏర్పాటు చేస్తామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో 71 షెడ్యూల్ పరిశ్రమల్లో కనీస వేతనాలను 15 ఏళ్లుగా సవరించలేదని విమర్శించారు. పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా వేతనాలు పెంచాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. స్కూల్ ఆయాలు, పంచాయతీ కార్మికుల బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని, ఆక్వా పరిశ్రమల్లో పీఎఫ్, ఈఎస్ఐతో పాటు కార్మిక చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని కోరారు. కాకినాడ జీజీహెచ్‌లో పనిచేస్తున్న శానిటేషన్, మెస్, సెక్యూరిటీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని, సెకండ్ ఏఎన్‌ఎంలుగా ఉన్న 52 మందిని సచివాలయ ఏఎన్‌ఎంలుగా నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ధర్నాలో వివిధ ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొని మద్దతు తెలిపారు.

kakinada


ఇతర రాష్ట్రాల్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల రెగ్యులరైజేషన్ సాధ్యమైనప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు సాధ్యం కాదు?

ఛలో కలెక్టరేట్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సమగ్ర శిక్ష ఉద్యోగులు

ప్రజాశక్తి.. విజయనగరం టౌన్ : సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, పార్ట్‌టైమ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గురువారం జిల్లా కలెక్టరేట్ వద్ద ఏపీ స్టేట్ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ & ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో ఛలో కలెక్టరేట్" కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా డిఆర్ఓకి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా రాష్ట్ర చైర్మన్ బి.కాంతారావు నాని మాట్లాడుతూపంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్, సిక్కిం, అస్సాం, మణిపూర్ రాష్ట్రాల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులకు రెగ్యులరైజేషన్ చేసినప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు సాధ్యం కావడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేజీబీవి రాష్ట్ర అధ్యక్షులు కే.విజయ్ గౌరీ మాట్లాడుతూ విద్యా వ్యవస్థకు వెన్నెముకగా పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా నిరంతరాయంగా సేవలందిస్తున్నప్పటికీ, ఇప్పటికీ ఉద్యోగ భద్రత, హెచ్‌ఆర్ పాలసీ, సరైన వేతనాలు, సామాజిక భద్రతా ప్రయోజనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామకృష్ణ మాట్లాడుతూ, జూన్ జీతాలు ఇప్పటికీ చెల్లించకపోవడం వల్ల వేలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి జూన్, జూలై నెలల జీతాలను తక్షణమే చెల్లించాలనిడిమాండ్ చేశారు.

కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, పార్ట్‌టైమ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి.

* సమగ్ర హెచ్‌ఆర్ పాలసీని తక్షణమే అమలు చేయాలి.

* మినిమం ఆఫ్ ఆఫ్ టైం స్కేల్ అమలు చేసి తక్షణమే వేతనాలు పెంచాలి

* ప్రతి నెలా సకాలంలో జీతాలు చెల్లించాలి.

* ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మార్చాలి.

* పార్ట్‌టైమ్ విధానం తొలగించి ఫుల్‌టైమ్ ఉద్యోగులుగా మార్చాలి.

* పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచి ఈపీఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్ తదితర ప్రయోజనాలు కల్పించాలి.

* ఉద్యోగులకు ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత కల్పించాలి.

* ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.

* టీచర్స్ డీఎస్సీతో పాటు అన్ని ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగ నియామకాలలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు సర్వీస్ వెయిటేజ్ కల్పించాలి.

ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకొని, జూన్, జూలై నెలల జీతాలకు చెల్లించేందుకు నిధులు విడుదల చేయాలని

డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో కూడిన వినతి పత్రం జిల్లా రెవెన్యూ అధిహరికి అందజేశారు. లేకుంటే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆగస్టు 24న నిర్వహించనున్న "ఛలో విజయవాడ" కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున విజయవంతం చేస్తామని, వేలాది మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని తమ హక్కుల సాధన కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ శ్రీనివాసరావు, సీఆర్ఏంటి యూనియన్ నాయకులు లక్ష్మణరావు దేవుడు బాబు, ఏం. ఐ .ఎస్. యూనియన్ పోలి నాయుడు, మెసెంజర్ యూనియన్ నాయకులు జయగణేష్, జిల్లా నాయకులు నారాయణ రావు,లక్ష్మి, గోవిందరావు,రాము, అనిత, శాంతి పాల్గొన్నారు.


vzm


కదం తొక్కిన కార్మికులు ...

ప్రజాశక్తి - కలక్టరేట్ (కృష్ణా): కార్మికుల శ్రమతో ప్రభుత్వ, ప్రైవేటు వ్యవస్థలు నడుస్తున్నప్పటికీ వారికి న్యాయమైన వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని సీఐటీయూ నాయకులు కళ్ళెం వెంకటేశ్వరరావు, మాదాల వెంకటేశ్వరావులు విమర్శించారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం 'ఛలో కలెక్టరేట్' కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో వివిధ శాఖలకు చెందిన కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కేఆర్‌ఆర్‌సీఎస్‌డీసీ పి. నీలకంటేశ్వరరెడ్డికి అందజేశారు.

ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ, సమాన పని చేస్తున్న ఉద్యోగులకు సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా, దానిని అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి జాన్ మోడీ మాట్లాడుతూ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, హైర్ విధానాల పేరుతో ఒకే విధమైన విధులు నిర్వహిస్తున్న కార్మికులకు వేర్వేరు వేతనాలు చెల్లించడం అన్యాయమన్నారు. న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయకుండా కాలయాపన చేయడం కార్మికుల హక్కులను కాలరాయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఏపీఎస్‌ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్, ఈస్ట్ కృష్ణ లారీ డ్రైవర్స్ అండ్ వర్కర్స్, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల నాన్-టీచింగ్ ఉద్యోగులు, బస్ డ్రైవర్లు, ఏపీ గ్రామ పంచాయతీ వర్కర్స్, ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్, గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, షాప్స్ అండ్ మాల్స్ యూనియన్, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ అండ్ వర్కర్స్, ఆక్వా కార్మిక సంఘం, స్పిన్నింగ్ మిల్స్ కార్మికులు, కృష్ణా జిల్లా ఇండస్ట్రియల్ అండ్ ఆటోమొబైల్ వర్కర్స్ యూనియన్, పెట్రోల్ బంకు కార్మిక సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.



krishna




nellore

నెల్లూరు : కార్మికులకు కనీస వేతనం 26000 ఇవ్వాలని నెల్లూరు విఆర్సి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు సిఐటియు ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన దద్దరిల్లిన నెల్లూరు కలెక్టరేట్

avn


vja


avn

కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలి : ఏవి నాగేశ్వరరావు

విజయవాడ : కనీస వేతనాలను వెంటనే సవరించి రూ.26,000గా నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా సిఐటియు నిర్వహించిన జూలై 30, 31 ఛలో కలెక్టరేట్ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.వి. నాగేశ్వరరావు మాట్లాడారు.

తిరుపతి

తిరుపతి : కనీస వేతనం అమలు చేయాలని తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ధర్నా కార్యక్రమాన్ని పోలీసులు రంగ ప్రవేశం చేసి నిలదీస్తున్న నాయకులను ఈడ్చుకొని పోలీసు జీబుల్లోకి ఎక్కి పోలీస్ స్టేషన్కు తరలించారు. వందలాదిగా వచ్చిన ఔట్సోర్సింగ్ కార్మికులు కలెక్టరేట్ వద్దనే తమ నిరసనను తెలియజేస్తుండగా పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా నినాదాలు సిఐటియు నాయకులు చేశారు.

tpt








tpt





తిరుపతి : చంటి బిడ్డతో కనీస వేతనం కోసం సిఐటియు చేపట్టిన నిరసన ధర్నాలో పాల్గొన్న ఓ తల్లి

tpt



తిరుపతి : కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరసన ధర్నా కార్యక్రమంను పోలీసులు ద్వారా అణిచివేయాలని రాష్ట్ర ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించింది. పోలీసులను అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన చేస్తున్న సిఐటియు నాయకులు

wg





పశ్చిమ గోదావరి జిల్లా : కలెక్టరేట్ ముట్టడికి ర్యాలీగా వెళ్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు.arrest








visakha



విశాఖ-కలెక్టరేట్:కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు, షెడ్యూల్ ఎంప్లాయిస్ కు కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో గురువారం విశాఖపట్నంలో వేలాది మందితో మహా ప్రదర్శన జరిగింది. సరస్వతి పార్కు వద్ద ప్రారంభమైన ప్రదర్శన, సరస్వతి జంక్షన్, జగదాంబ జంక్షన్, లేపాక్షి జంక్షన్, కెజిహెచ్ మీదుగా కలెక్టరేట్ కు చేరింది.


praksam

ఒంగోలు సిటీ :

రాష్ట్రప్రభుత్వం కార్మికుల పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జిల్లా నలుమూలల నుంచి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, వివిధ రంగాల కార్మికులు గురువారం ఒంగోలు కలెక్టరేట్‌కు భారీగా తరలివచ్చారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్