ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వేటపాలెం మండలంలో గ్రామ పంచాయతీల పునరుద్ధరణ

1 గంట క్రితం

vetapalem
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 11:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రకాశం జిల్లా వేటపాలెం మండలంలో గతంలో ఉన్న ఎనిమిది గ్రామ పంచాయతీలను పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 డిసెంబరు 31న జారీ చేసిన జీఓ ఎంఎస్ నంబర్ 221 ద్వారా వేటపాలెం మండలంలోని కొన్ని గ్రామాలను విడదీసి లక్ష్మీపురం, కోనిజేటి చేనేతపురి, వైఎస్సార్ గ్రామ పంచాయతీలను కొత్తగా ఏర్పాటు చేశారు. అదే సమయంలో అక్కాయపాలెం, చల్లారెడ్డిపాలెం, దేశాయిపేట, కొత్తపేట, పందిళ్లపల్లి, పాపాయపాలెం, పుల్లరిపాలెం, వేటపాలెం గ్రామ పంచాయతీలను పునర్వ్యవస్థీకరించారు. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్‌‌పై హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంటూ జీఓ ఎంఎస్ నంబర్ 221ను రద్దు చేసింది. కొత్తపేట గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహించి, గ్రామస్థుల అభ్యంతరాలను స్వీకరించాలని ఆదేశించింది. కొత్తపేట గ్రామ పంచాయతీకి వీలైనంత త్వరగా, గరిష్ఠంగా ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం జిఒ 221ను ఉపసంహరించుకుంది. దాని ద్వారా ఏర్పాటు చేసిన లక్ష్మీపురం, కోనిజేటి చేనేతపురి, వైఎస్సార్ గ్రామ పంచాయతీల ఏర్పాటును రద్దు చేసింది. దీంతో అక్కాయపాలెం, చల్లారెడ్డిపాలెం, దేశాయిపేట, కొత్తపేట, పందిళ్లపల్లి, పాపాయపాలెం, పుల్లరిపాలెం, వేటపాలెం గ్రామ పంచాయతీలను గతంలో ఉన్న భౌగోళిక పరిధితోనే పునరుద్ధరించింది. ఈ మేరకు గెజిట్‌ ‌జారీ చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్