- ముగిసిన తుదిదశ కౌన్సెలింగ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు 49,450 సీట్లు మిగిలాయి. రాష్ట్రంలో 241 ఇంజనీరింగ్ కళాశాలల్లో 1,52,100 కన్వీనర్ సీట్లు ఉన్నాయి. వీటిల్లో 1,02,650 సీట్లు భర్తీ కాగా 49,450 సీట్లు భర్తీ కాలేదు. 26 యూనివర్సిటీ కళాశాలల్లో 9,479 సీట్లకు 7441 సీట్లు విద్యార్ధులు ఎంపిక చేసుకున్నారు. 200 ప్రైవేట్ కళాశాలల్లో 1,27,487 సీట్లు ఉండగా 81,653 సీట్లు, 15 ప్రైవేట్ యూనివర్సిటీల్లో 15,134 సీట్లు ఉంటే 13,556 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ నెల 9వ తేది నుంచి ఇఎపిసెట్ మూడో దశ కౌన్సెలింగ్ ప్రారంభయింది. ఇఎపిసెట్‌లో మొత్తం 1,74,971 మంది అర్హత సాధించగా మూడో దశల్లో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో 1,15,562 మంది రిజిస్ర్టేషన్ చేసుకున్నారు.
మూడో దశలో కొత్తగా 456 మంది రిజిస్ర్టేషన్ చేసుకున్నారు. తుది దశలో 25,204 మంది ఆప్షన్లు పెట్టుకోగా 3,141 మంది అడ్మిషన్లు పొందారు. ఎపి స్పోర్ట్స్ ఆథారిటీ(శాప్) నుంచి మెరిట్ జాబితా రాకపోవడంతో 659 మంది స్పోర్ట్స్ అభ్యర్ధులకు సీట్లు కేటాయించలేదని ఇఎపిసెట్ అడ్మిషన్ల కన్వీనర్, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నారాయణ భరత్‌గుప్తా ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.








కామెంట్‌లు (0)