mh ad
సోమవారం, 22 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'మున్సిపల్' ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోటెత్తిన కార్మికులు

2 గంటల క్రితం

municipal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 22, 2026, 12:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రైవేటీకరణ ఉపసంహరణ, పర్మినెంట్ చేయాలని డిమాండ్

విజయవాడ : మున్సిపల్ రంగంలో ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించాలని, హైకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కార్మికులు భారీగా పాల్గొన్నారు. “సమాన పనికి సమాన వేతనం” అమలు చేయాలని, మున్సిపల్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు ధర్నా చౌక్ వద్ద నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కార్మికులు నేతలు మాట్లాడుతూ ప్రైవేటీకరణ విధానాల వల్ల ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పర్మినెంట్ ప్రక్రియ ఆలస్యం అవుతోందని ఆగ్రహించారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని కార్మిక సంఘం నాయకులు హెచ్చరించారు.


https://www.facebook.com/share/v/1BHuWtECEa/


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్