బుధవారం, 08 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

విజయవాడలో మరోసారి ఎన్‌ఐఏ సోదాలు

6 గంటల క్రితం

nia raids
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 09:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఉగ్రవాద నెట్‌వర్క్‌పై దర్యాప్తు..

- గాంధీబొమ్మ సెంటర్‌లో ఇంట్లో తనిఖీలు

విజయవాడ: విజయవాడ నగరంలోని టౌన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వించిపేటలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు మరోసారి సోదాలు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం నుంచి గాంధీబొమ్మ సెంటర్‌లోని ఓ నివాసంలో ఎన్‌ఐఏ బృందం విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. ఆన్‌లైన్ ద్వారా ఉగ్రవాద నెట్‌వర్క్‌ను విస్తరింపజేస్తున్నారనే అనుమానాల నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. వించిపేట ప్రాంతంలో ఉగ్రవాద అనుమానితుల ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించడం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం. ఈ ఏడాది మార్చి, మే నెలల్లో ఇదే ప్రాంతంలో నిర్వహించిన సోదాల అనంతరం నలుగురు అనుమానితులను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. తాజా తనిఖీలతో వించిపేట ప్రాంతంలో మరోసారి ఉగ్రవాద కార్యకలాపాలపై కలకలం నెలకొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్