ముంబయి : ఇన్‌స్టామార్ట్ సిఇఒ అమితేశ్ కుమార్ ఝా రాజీనామాతో స్విగ్గీ షేర్లు పరుగులు పెట్టాయి. జులై 28న ఆయన రాజీనామా తక్షణమే అమల్లోకి రాగా ఆగస్టు 3 నుంచి నందిత సిన్హా కొత్త సిఇఒగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ పరిణామంతో స్విగ్గీ షేరు ఇంట్రాడేలో రూ.273ను తాకి దాదాపు 5 శాతం లాభపడింది. ఇన్‌స్టామార్ట్ కాంట్రిబ్యూషన్ మార్జిన్‌ను క్రమంగా మెరుగుపరచడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని కంపెనీ తెలిపింది. కొత్త సిఇఒ నందిత సిన్హాకు ఫ్లిప్‌కార్ట్ సహా ఇ-కామర్స్ రంగంలో అనుభవం ఉంది. మంగళవారం బిఎస్‌ఇలో స్విగ్గీ షేర్ 4.70 శాతం పెరిగి రూ. 270.10 వద్ద ముగిసింది.
Print Editionఇన్‌స్టామార్ట్ సిఇఒ రాజీనామా..
54 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 28, 2026, 09:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)