బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ విజయం

1 గంట క్రితం

rasha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 10:01 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- పుట్టినరోజు నాడే మేయర్ పదవి

విజయవాడ: విజయవాడ నగరపాలక సంస్థ మేయర్‌గా జనసేన పార్టీ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ ఘన విజయం సాధించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మిపై ఏకంగా 1,30,872 ఓట్ల భారీ మెజారిటీతో దక్కింది. రాధాకృష్ణకు 2,65,888 ఓట్లు రాగా, భాగ్యలక్ష్మికి 1,35,016 ఓట్లు లభించాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు 12,642 ఓట్లు వచ్చాయి. భారీ మెజారిటీతో విజయం సాధించిన వంగవీటి రాధాకృష్ణకు జనసేన పార్టీ శ్రేణులు, అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు. తన పుట్టినరోజు నాడే మేయర్‌గా ఎన్నిక కావడంతో ఈ విజయం ఆయనకు మరింత ప్రత్యేకంగా నిలిచింది. మేయర్‌గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు జారీ చేసిన ధ్రువీకరణ పత్రాన్ని వంగవీటి రాధాకృష్ణ స్వీకరించారు. తన సతీమణితో కలిసి వచ్చి అధికారికంగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ.. తనపై విజయవాడ నగర ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచనలు, సహకారంతో విజయవాడ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇంతటి భారీ మెజారిటీతో తనను గెలిపించిన నగర ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్