mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ.. బారులు తీరిన జనం

09 జూన్, 2026

fish
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 09, 2026, 08:51 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్: మృగశిర కార్తె పురస్కరించుకుని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగుతోంది. బత్తిన సోదరులు అందిస్తున్న ఈ చేప ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తెల్లవారుజాము నుంచే భారీగా తరలివచ్చి క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మత్స్య శాఖ (ఫిషరీస్ డిపార్ట్‌మెంట్) సుమారు 3 లక్షల చేప పిల్లలను సిద్ధం చేయగా, రాత్రి నుంచి ఇప్పటివరకు 50 వేలకు పైగా మందికి చేప ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ప్రసాదం కోసం వచ్చే వీఐపీలు, దివ్యాంగులు, వృద్ధులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. జనాల తాకిడి, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అదనపు చేప పిల్లలను తరలించేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించారు. కాగా, ఈ చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఈరోజు రాత్రి 9 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని నిర్వాహకులు వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్