రాప్తాడు (అనంతపురం) : రాప్తాడులో విద్యార్థినులపై ఎలక్ట్రిక్ రంపంతో దాడికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి విదితమే. ఉన్మాది డుంబు అలియాస్ హేమంత్ పై పోలీసులు ఆదివారం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడిన నిందితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. అయితే, హేమంత్‌కు కాళ్లు తొలగించే యోచనలో వైద్యులు ఉన్నట్లు తెలుస్తోంది. హేమంత్‌కు రెండు కాళ్లలో మూడు బుల్లెట్లు ఇరుక్కున్నాయి. కాళ్ల తొలగింపునకు సర్జరీ చేయనున్నట్లు తెలిసింది. కాగా ... నిందితుడిని పట్టుకునేందుకు 25 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు ఆత్మకూరు సమీపంలోని అడవుల్లో ఉన్నాడనే పక్కా సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ నిందితుడిని గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేస్తున్న పోలీసులపై అతడు ఒక్కసారిగా కత్తితో దాడికి యత్నించాడు. దీంతో రాప్తాడు సిఐ వెంకటేశ్వర్లు చేతికి గాయాలయ్యాయి. అయితే ఆత్మరక్షణ కోసం పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో నిందితుడి మోకాళ్లలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని పట్టుకుని అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నాడు. రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం పదో తరగతి విద్యార్థిని గోపిక తరగతి గదిలో చదువుకుంటుండగా చెట్లు కోసే ఎలక్ట్రిక్ రంపంతో హేమంత్ విచక్షణారహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని లక్ష్మీపైనా దాడికి తెగబడ్డాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన గోపికను మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించగా, మరో విద్యార్థిని లక్ష్మీ అనంతపురం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఆసుపత్రిలో రాక్షసుడు - కాళ్లు తొలగించే ఆలోచనలో డాక్టర్లు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 02, 2026, 12:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)