సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆదరించండి.. అండగా ఉంటాం

1 గంట క్రితం

konaseema
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 01:09 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- వైసీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు

ప్రజాశక్తి - అంబాజీపేట : రానున్న మండల పరిషత్ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ తొండవరం గ్రామంలో వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి విత్తనాల గంగాభవానీ, ఎంపీటీసీ అభ్యర్థి కడలి చంద్రకళ సుబ్బారావులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తమను గెలిపిస్తే యువతకు, ప్రజలకు, రైతులకు అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తామని కోరారు. తొండవరం గ్రామంలోని ఎస్సీ ఏరియా, వెన్నపువారి కాలనీ, రూతమ్మ కాలనీ, గొల్లపాలెం, ఓసీ ఏరియా, రజకపేటలలో పర్యటించి, ఈ నెల 5న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.వైసీపీ అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ ఆ పార్టీ సీనియర్ నాయకులు కొర్లపాటి కోటబాబు, సుదాబత్తుల రాము, మద్దింశెట్టి మల్లిబాబు లు ప్రచారంలో పాల్గొని వారికి మద్దతు గా నిలిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. ప్రతి నెలా ఒక సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. గ్రామ స్వరాజ్యాన్ని ఆకాంక్షించి గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి, ప్రతి గ్రామంలో సచివాలయ భవనాలను నిర్మించి ఉద్యోగాలు కల్పించామన్నారు. గ్రామ సచివాలయం నుంచి ప్రజలకు ప్రభుత్వ సేవలు అందేలా చేశామన్నారు. వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలను చేర్చిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు.నేడు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అమరావతిని చూపుతూ అభివృద్ధి అని ప్రజలను మభ్యపెడుతోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా కొత్త పింఛన్లు కానీ, కొత్తగా పక్కా గృహాలు కానీ, రేషన్ కార్డులు కానీ ప్రజలకు అందించిన దాఖలాలులేఇవ్వండి‌ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే భవిష్యత్తులో రాష్ట్రాన్ని మరింత నాశనం చేస్తారని, భవిష్యత్తు బాగుండాలంటే వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.ఈ ప్రచారంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రెండు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్