సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బ్లో అవుట్ - సిఎం సమీక్ష - డిప్యూటి సిఎం ఆరా

6 రోజుల క్రితం

Blowout in Konaseema CM review Deputy CM inquires
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 01:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో చోటుచేసుకున్న బ్లో అవుట్‌ ఘటన పై అధికారులతో సిఎం చంద్రబాబు మంగళవారం సమీక్షించారు. గ్యాస్ లీకేజీ ప్రభావిత ప్రాంతాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. లీకేజీని అరికట్టేందుకు ఓన్‌జీసీ ప్రత్యేక సాంకేతిక బృందాలతో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కిలో మీటర్‌ పరిధిలోని నివాస ప్రాంతాల ప్రజలను ఇప్పటికే ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మంటలు చెలరేగలేదని, గ్యాస్ బావి ముఖద్వారం పటిష్ఠంగానే ఉందని ఓఎన్‌జీసీ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నందున ఓఎన్‌జీసీ ఛైర్మన్‌తో పాటు ఉన్నతాధికారులతో మాట్లాడి భద్రతా చర్యలను సమీక్షించాలని చంద్రబాబు ఆదేశించారు.


గ్యాస్‌ లీకేజీ పై పవన్‌ ఆరా ...

కోనసీమ జిల్లాలో జరిగిన బ్లోఅవుట్‌ ఘటనపై డిప్యూటీ సిఎం పవన్‌ కల్యాణ్‌ ఆరా తీశారు. తీవ్రత, పరిసర గ్రామాల ప్రజల భద్రత తదితర అంశాలపై జిల్లా కలెక్టర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో పెద్ద శబ్దంతో ఒక్కసారిగా గ్యాస్ వెలువడినట్లు కలెక్టర్ తెలిపారు. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పవన్‌ ఆదేశించారు. వరుస బ్లో అవుట్‌ ఘటనల నేపథ్యంలో సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్