సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బకాయి ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ

17 నిమిషాల క్రితం

Release the outstanding fee reimbursement SFI
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 03:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా - డీఆర్వోకి వినతి


ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : బకాయి ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ .. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం కోట దగ్గర నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి,తరువాత కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం జిల్లా డీఆర్వోకి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి రాము మాట్లాడుతూ గతంలో యువగలం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం విద్యార్థుల్ని నట్టేట ముంచింది, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏ కళాశాలకు ఒక పైసా కూడా విద్యార్థులు ఫీజు కట్టకుండా ప్రశాంతంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా చదువుకోవచ్చు అన్నారు. నమ్మి ఓట్లు వేసిన తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చి విద్యార్థులకు మోసం చేస్తున్నారు. ఒకవైపు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతినెల ఎటువంటి బకాయి లేకుండా ఖాతాలో డబ్బులు వేస్తున్నామని పేపర్ ప్రకటనలు చేస్తున్నారు. ఆ డబ్బులు ఎవరికి వేస్తున్నారు, ఎంత వేస్తున్నారో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికె తెలియాలి. ఏ నెలకి ఆ నెల డబ్బులు పడితే రాష్ట్రవ్యాప్తంగా 4500 కోట్లకు పైగా స్కాలర్షిప్లు ఎందుకు పెండింగ్లో ఉన్నాయి. విద్యార్థులు ఎందుకు రోడ్లమీదకు వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చిత్తూరులో విద్యార్థిని ఎందుకు ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థులు చెవిలో బుట్టాలు తాకట్టు పెట్టి పేజులు కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలను మభ్యపెట్టి ప్రకటనకు పరిమితం కాకుండా బకాయి ఉన్నటువంటి 4500 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని ఎస్ ఎఫ్ ఐ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి రాము, జిల్లా గర్ల్స్ కన్వీనర్ భారతి, పట్టణ అధ్యక్షులు సూరిబాబు, నాయకులు కృష్ణ, గుణ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Release the outstanding fee reimbursement SFI


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్