హీరో నాని నటించిన తాజా చిత్రం ‘ప్యారడైజ్’. ఇందులో మోహన్‌బాబు ప్రతినాయకుడిగా, కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించారు. కీర్తిసురేష్ ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 24న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నాని అన్నకు సినిమాలో జడల లుక్ చెప్పినప్పుడు మూవీ టీమ్ మొత్తం వద్దని చెప్పినా, తనపై నమ్మకంతో నాని ఒప్పుకున్నారని తెలిపారు. తన చిన్నప్పటి జడలే ఈ లుక్‌కు స్ఫూర్తి అన్నారు. ట్రైలర్‌కు సమయం లేక విడుదల చేయలేదని, సినిమాను నేరుగా థియేటర్లలో చూసి మాట్లాడుకోవాలన్నదే తన అభిప్రాయమని చెప్పారు. ఈ సినిమాకు సీక్వెల్స్ లేవని స్పష్టం చేశారు. మోహన్‌బాబు నటన ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని, సంపూర్ణేశ్‌బాబు కీలక పాత్రలో నటించారని తెలిపారు. తొలుత యాక్షన్ సినిమాగా అనుకున్నప్పటికీ, క్లైమాక్స్‌లో నాని ఎమోషనల్ సీన్స్ గుండెల్ని పిండేస్తాయని శ్రీకాంత్ ఓదెల అన్నారు.
‘ప్యారడైజ్’కు సీక్వెల్స్ లేవు
57 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 07:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)