శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తుపాను ఎఫెక్ట్ - బాపట్ల తీరం అల్లకల్లోలం

4 రోజుల క్రితం

Cyclone impact Bapatla coast in turmoil
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026, 12:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : మురసు’ తీవ్ర తుపాను తీరం దాటింది. మంగళవారం తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 గంటల మధ్య ఒంగోలు సమీపంలో తీరం దాటినట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ సమయంలో గంటకు 100-110 కి.మీ వేగంతో కొన్నిసార్లు 120 కి.మీ వేగంతో గాలులు వీచాయని వెల్లడించింది. తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణాతో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. బాపట్ల సముద్ర తీరం అల్లకల్లోలంగా మారి ఉగ్రరూపం దాల్చింది. తుపాను ప్రభావానికి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. మురసు తుపానుతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం సమీక్షిస్తున్నారు. మరో రెండు రోజులు వర్షాల దృష్ట్యా అధికారులను సిఎం అప్రమత్తం చేస్తున్నారు. సహాయచర్యలకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్