శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మెల్‌బోర్న్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖకు చెందిన అత్తాకోడళ్లు మృతి

2 రోజుల క్రితం

vizag.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 06:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం): ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నానికి చెందిన అత్తాకోడళ్లు రమాదేవి (67), నేహా (33) ప్రాణాలు కోల్పోయారు. పాయింట్‌ కుక్‌ ప్రాంతంలోని బోర్డ్‌వాక్‌ బౌలేవార్డ్‌, ఇన్నిస్‌ఫైల్‌ డ్రైవ్‌ కూడలిలో రాత్రి 9.40 గంటల సమయంలో వారు ప్రయాణిస్తున్న కారును మరో కారు బలంగా ఢీకొట్టినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన రమాదేవి, నేహా అక్కడికక్కడే మృతిచెందారు. కారు డ్రైవర్‌‌కు స్వల్పగాయాలయ్యాయి. మృతురాలు రమాదేవి విశాఖకు చెందిన మాజీ విడిసిఎ జాయింట్‌ సెక్రటరీ జిటి.ప్రసాద్ భార్య కాగా, నేహా ఆయన కోడలు. ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు భార్యతో కలిసి ప్రసాద్‌ ఆస్ట్రేలియాకు వెళ్లారు. ఆయన కళ్లముందే ఈ ప్రమాదం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై మెల్‌బోర్న్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను భారత్‌కు తరలించి విశాఖపట్నంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాలు సుమారు పది రోజుల తర్వాతనే విశాఖకు చేరుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. మృతురాలు నేహాకు ఇద్దరు చిన్నారులున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్