రాష్ట్రంలోని 28 జిల్లా పరిషత్‌లకు ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్‌ల ఎన్నిక ప్రక్రియ జరిగింది. గతంలో ఉన్న 13 జిల్లా పరిషత్‌లను 28కి పెంచిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక ఇది. కొత్తగా 15 జిల్లాల ఏర్పాటు తర్వాత జిల్లా పరిషత్‌లకు తొలిసారి ఛైర్మన్ ఎన్నికలు నేడు జరిగాయి. రాష్ట్రంలో అతి చిన్న జిల్లా పరిషత్‌గా విశాఖపట్నం, అలాగే రాష్ట్రంలో ఎక్కువ మంది జడ్పీ సభ్యులున్న జిల్లా పరిషత్‌గా కడప ఉన్నాయి. తాజాగా పలు జిల్లాల్లో పరిషత్‌లకు ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్‌ల ఎన్నిక పక్రియ పూర్తయింది. గెలిచిని వారి వివరాలు ఇలా..
కాకానాడ జిల్లా :
కాకినాడ జడ్పీ ఛైర్‌పర్సన్‌గా బుర్ర దివ్య సునీత ఎన్నిక
కాకినాడ జడ్పీ వైస్ ఛైర్‌పర్సన్‌గా పంపన రాజేశ్వరి ఎన్నిక
మన్యం జిల్లా :
పార్వతీపురం జడ్పీ ఛైర్‌పర్సన్‌గా నీలిమ (జనసేన) ఎన్నిక
పార్వతీపురం జడ్పీ వైస్ ఛైర్‌పర్సన్‌గా టీడీపీ నుంచి వీరేశ్‌చంద్ర ఎన్నిక
పల్నాడు జిల్లా :
పల్నాడు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా పుచ్చకాయల రమాదేవి ప్రమాణస్వీకారం
విజయనగరం జిల్లా :
విజయనగరం జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన మజ్జి సిరిసహస్ర
గుంటూరు జిల్లా :
గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా ధార అరుణ ప్రమాణస్వీకారం
చిత్తూరు జిల్లా :
చిత్తూరు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎం.శైలజ
చిత్తూరు జిల్లా వైస్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన మంజుల ప్రియ
నంద్యాల జిల్లా :
నంద్యాల జడ్పీ ఛైర్‌పర్సన్‌గా బృహనుద్దిన్ ప్రమాణస్వీకారం
నంద్యాల: వైస్‌ఛైర్‌పర్సన్‌గా శ్రీకాంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం
గుంటూరు జిల్లా :
గుంటూరు: ఛైర్‌పర్సన్‌గా ధార అరుణ, వైస్ ఛైర్‌పర్సన్‌గా అశోక్ కుమార్‌గౌడ్ ప్రమాణస్వీకారం
శ్రీసత్యసాయి జిల్లా :
శ్రీసత్యసాయి జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా పరిటాల శ్రీరామ్ ప్రమాణస్వీకారం
శ్రీసత్యసాయి జిల్లా పరిషత్ వైస్ ఛైర్‌పర్సన్‌గా సునేత్ర ప్రమాణస్వీకారం
కర్నూలు జిల్లా :
కర్నూలు జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఉలిగయ్యను ఏకగ్రీవంగా ఎన్నిక
కర్నూలు జడ్పీ వైస్‌ఛైర్‌పర్సన్‌గా షేక్ సాధికా ఏకగ్రీవంగా ఎన్నిక
కర్నూలు: ఛైర్‌పర్సన్‌గా, వైస్ ఛైర్‌పర్సన్‌తో ప్రమాణస్వీకారం చేయించిన కలెక్టర్
ఎన్టీఆర్ జిల్లా :
ఎన్టీఆర్ జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌గా కోట పుల్లమ్మ, వైస్‌చైర్మన్‌గా బాల కోటేశ్వరరావు ఏకగ్రీవ ఎన్నిక
విశాఖ జిల్లా :
విశాఖ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా, వైస్‌ఛైర్‌పర్సన్‌లతో ప్రమాణం చేయించిన కలెక్టర్
విశాఖ: ఛైర్‌పర్సన్‌గా అలివేణి, వైస్ ఛైర్‌పర్సన్‌గా సుఖవాసి అజయ్ ప్రమాణస్వీకారం
కడప జిల్లా :
కడప జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా పుత్తా నరసింహారెడ్డి, వైస్ ఛైర్‌పర్సన్‌గా హబీబున్నీసా ఎన్నికయ్యారు. వారితో కలెక్టర్ శ్రీధర్ ప్రమాణస్వీకారం చేయించారు.









కామెంట్‌లు (0)