ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

టొరంటోలో కాల్పులు .. ఇద్దరు మృతి

1 గంట క్రితం

Toronto
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 11:37 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

టొరంటో : కెనడాలోని టొరంటోలో ఒక దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. టొరంటోలో 'సల్సా ఆన్ సెయింట్ క్లెయిర్' స్ట్రీట్‌ ఫెస్టివల్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మరణించినట్లు అధికారులు తెలిపారు. సెయింట్ క్లెయిర్ అవెన్యూ వెస్ట్, ఆర్లింగ్టన్ అవెన్యూ సమీపంలో జరిగిన ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు టొరంటో పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. అనుమానితుడి గురించి గానీ, అరెస్టుల గురించి గానీ ఎటువంటి సమాచారం విడుదల కాలేదు. టొరంటోలోని 'సల్సా ఆన్‌ సెయింట్‌ క్లెయిర్‌ అనేది లాటిన్ నేపథ్యం కలిగిన ఒక సాంస్కృతిక వేడుక.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్