శనివారం, 21 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పారా అథ్లెట్‌ నీరజ్‌ యాదవ్‌ ఆత్మహత్య

28 అక్టోబర్, 2026

Asian Para Games gold medalist Neeraj Yadav dies by suicide
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026, 03:52 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ: ఆసియా పారా క్రీడల స్వర్ణ పతక విజేత నీరజ్‌ యాదవ్‌(42) ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీలో అతని నివాసంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకొంది. బుధవారం ఉదయం ఫ్లాట్‌లో అచేతనంగా ఉన్న నీరజ్‌ యాదవ్‌ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషయాన్ని భారత పారా అథ్లెటిక్స్‌ జట్టు ప్రధాన కోచ్‌ ఎస్‌. సత్యనారాయణ ధృవీకరించారు. ‘ఇలాంటి ఘటన జరగడం దురదృష్టం’ అని సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. 2005, 2012, 2018 ఆసియా పారా క్రీడల్లో వీల్‌ఛైర్‌ టెన్నిస్‌లో నీరజ్‌ యాదవ్‌ స్వర్ణ పతకాలు సాధించారు. 2015లో న్యూఢిల్లీ వేదికగా జరిగిన అథ్లెటిక్స్‌ మీట్‌లో షాట్‌పుట్‌, జావెలిన్‌ త్రో, డిస్కస్‌ త్రో విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించారు. 2018లో జకార్తా వేదికగా జరిగిన ఆసియా పారా క్రీడల్లో జావెల్‌ త్రో ఎఫ్‌-55లో 29.84మీ. విసిరి రికార్డు నెలకొల్పారు. 2023 హాంగ్జౌ క్రీడల్లో జావెలిన్‌ త్రో, డిస్కస్‌ త్రో, షాట్‌ పుట్‌ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించి హ్యాట్రిక్‌ సాధించారు. ఆ తర్వాత నేషనల్‌ డోపింగ్‌ ఏజెన్సీ(నాడా) నిర్వహించిన డిఎన్‌ఎ పరీక్ష‍ల్లో విఫలమయ్యాడు. దీంతో ఐచి-నగోయా వేదికగా జరిగిన 5వ ఆసియా పారా క్రీడలకు నీరజ్‌ యాదవ్‌ ఎంపికకాలేదు. నీరజ్‌ యాదవ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన వెంటనే పారా ఒలింపిక్‌ ఛాంపియన్లు సుమిత్‌ అంటిల్‌, విపిన్‌ కాసానా ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.


ఆసియా పారా గేమ్స్‌లో నీరజ్ యాదవ్ కు 3 స్వర్ణాలు ..


2018‌లో ఇండోనేషియాలోని జకార్తా వేదికగా జరిగిన పురుషుల F55 జావెలెన్ త్రో విభాగంలో 29.84 మీటర్ల దూరంతో ఆసియా రికార్డు నమోదు చేసిన నీరజ్ యాదవ్ స్వర్ణ పతకం సాధించారు.


2023లో చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో జావెలెన్ త్రో F55, డిస్కస్ త్రో F54/55/56 విభాగాల్లో నీరజ్ యాదవ్ రెండు స్వర్ణ పతకాలను అందుకున్నారు.


మొరాకో వేదికగా జరిగిన 2022 పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్‌లో పసిడి పతకం సాధించారు.


దుబాయ్ వేదికగా జరిగిన 2016 ఫజ్జా గ్రాండ్ ప్రిక్స్‌లో F55 షాట్‌పుట్, డిస్కస్ త్రో విభాగాల్లో రెండు సిల్వర్ పతకాలు గెలుచుకున్నారు.


2015 ఢిల్లీ స్టేట్ అథ్లెటిక్స్ మీట్‌లో షాట్‌పుట్, జావెలెన్ త్రో, డిస్కస్ త్రో విభాగాల్లోనూ మూడు స్వర్ణ పతకాలు సాధించి యావత్ దేశాన్ని తనవైపు తిప్పుకున్నారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్