సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సౌదీలో అగ్ని ప్రమాదం.. 16మంది బంగ్లాదేశ్‌ కార్మికులు మృతి

1 గంట క్రితం

Saudi factory
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 03:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రియాద్‌ : సౌదీ అరేబియాలో ప్రముఖ సోఫా తయారీ కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 16 మంది బంగ్లాదేశ్‌ వలస కార్మికులు మరణించినట్లు అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సౌదీ రాజధాని రియాద్‌లోని మూసా సనైయా పారిశ్రామిక ప్రాంతంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. అక్కడి పరిస్థితిని పర్యవేక్ష‍ిస్తున్నట్లు బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. మృతదేహాలను స్వదేశానికి తరలించే ప్రక్రియపై రియాద్‌లోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయ అధికారులు, సౌదీ అధికారులతో కలిసి పనిచేస్తున్నారని ప్రకటన పేర్కొంది. సౌదీ అరేబియాలో సుమారు 35 లక్ష‍ల మంది బంగ్లాదేశానికి చెందిన వలసకార్మికులు పనిచేస్తున్నారు. గతేడాది వీరు 2.7 బిలియన్‌ డాలర్లకు పైగా మొత్తాన్ని స్వదేశానికి పంపినట్లు తెలుస్తోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్