మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అన్నాయిపేట లో రూ.81.90 లక్షల వాటర్ ట్యాంక్ ప్రారంభించిన మంత్రి

1 గంట క్రితం

Minister inaugurates water tank worth Rs 81.90 lakh in Annaipeta.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 03:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : మండలం లోని అన్నయ్యపేట గ్రామంలో రూ.81.90 లక్షల వ్యయంతో నిర్మించిన వాటర్ ట్యాంక్‌ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించే దిశగా విస్తృతంగా పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.అన్నయిపేట గ్రామంలో 40 వేల లీటర్ల సామర్థ్యంతో, 4 వేలు మంది ప్రజలకు ప్రయోజనం చేకూరేలా, 400 వాటర్ ట్యాంక్‌ను నిర్మించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామ ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందుబాటులోకి రావడంతో పాటు భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని సౌకర్యాలు కల్పించామని వివరించారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామాల వారీగా అవసరాలను గుర్తించి రోడ్లు, తాగునీరు, డ్రైనేజీలు, విద్యుత్, పారిశుధ్య సదుపాయాల మెరుగుదలకు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, జనసేన పార్టీ ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, మండల టిడిపి అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనుబాబు, గ్రామ ప్రత్యేక అధికారి మణిదీప్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ టీ చైతన్య కుమారి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు ఎం విజయ భాస్కర్, ఎన్ లక్ష్మీ, వైస్ ఎంపీపీలు నరాల రాజ్యలక్ష్మి,శాక బాబి, సలాది శ్రీను,ఆకేటి సురేష్,కూటమి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామస్థులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్