మన్యం : పార్వతీపురం మన్యం జిల్లా, వీరఘట్టం మండలం: తెట్టంగి గ్రామంలోని పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బి. లోకేష్ రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 20వ తేదీన జి.ఎల్.పురంలో మన్యం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో, అండర్-16 బాలుర విభాగంలోని 600 మీటర్ల రన్నింగ్‌లో లోకేష్ ప్రథమ స్థానం సాధించాడు. దీంతో వచ్చే నెలలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో మన్యం జిల్లా తరఫున పాల్గొనే అవకాశం లభించింది. లోకేష్‌కు క్రీడా శిక్షణ అందించిన PET చంద్రశేఖర్ గారు, ఎన్ని రాము గారులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. వారి శిక్షణ, ప్రోత్సాహంతో విద్యార్థి జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి డి. నాగమణి, ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థి లోకేష్‌ను అభినందించారు. అలాగే స్థానిక జనసేన నాయకులు పి.జె. మోహన్ రావ్, వండాన సత్యనారాయణ, రిటైర్డ్ హెడ్‌మాస్టర్, వంజరపు సత్యనారాయణ (దాలి నాయుడు), ఐటీడీపీ నాయకులు వండాన శ్యామ్ విద్యార్థి లోకేష్‌ను జనసేన పార్టీ తరఫున అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ప్రోత్సాహంగా ట్రాక్‌సూట్ మరియు స్పైక్ షూస్ అందజేస్తామని తెలిపారు. లోకేష్ రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా ప్రతిభ కనబరిచి తెట్టంగి గ్రామానికి, పాఠశాలకు, పార్వతీపురం మన్యం జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.
రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు తెట్టంగి పాఠశాల విద్యార్థి ఎంపిక
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 03:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)