క్విటో : ఈక్వెడార్ మాజీ అధ్యక్షుడు లెనిన్ మోరెనో (73)కు లంచం కేసులో కోర్టు శుక్రవారం ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే శారీరక వైకల్యం కారణంగా ఆయన శిక్షను గృహనిర్బంధంలో అనుభవించనున్నారు. జలవిద్యుత్ ప్లాంటు నిర్మాణ కాంట్రాక్టు ఇప్పించడంలో సహకరించినందుకు చైనా కంపెనీ నుంచి లంచాలు తీసుకున్నట్లు కోర్టు నిర్ధారించింది. మోరెనో ఉపాధ్యక్షుడిగా ఉన్న 2008–2018 కాలంలో సినోహైడ్రో చేపట్టిన కోకా కోడో సింక్లెయిర్ జలవిద్యుత్ ప్రాజెక్టు విలువలో నాలుగు శాతం మేర లంచాలు చెల్లించినట్లు ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఈ కేసులో మోరెనో భార్య, కుమార్తెకు చెరో 30 నెలల జైలు శిక్ష పడింది. అవినీతి కేసులో శిక్ష పడిన ఈక్వెడార్ మాజీ అధ్యక్షుల్లో మోరెనో మూడో వ్యక్తి.
ఈక్వెడార్ మాజీ అధ్యక్షుడికి ఐదేళ్ల జైలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 29, 2026, 12:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)