ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

హార్ముజ్‌ను తిరిగి తెవరబోము : ఐఆర్‌జిసి

1 గంట క్రితం

Hormuz
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 09, 2026, 03:52 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

టెహ్రాన్‌ : ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవబోమని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జిసి) ఆదివారం ప్రకటించాయి. యుద్ధ నష్టాలకు పరిహారం సహా శనివారం ఇరాన్‌ విధించిన షరతులను అమెరికా అంగీకరించేంతవరకు హార్ముజ్‌ జలసంధిని తెరవబోమని పేర్కొంది. అమెరికా తమ షరతులన్నింటినీ అంగీకరించే వరకు ఈ జలసంధిపై పట్టు కొనసాగించడమే తమ ప్రస్తుత వ్యూహమని (ఐఆర్‌జిసి) ప్రతినిధి హొస్సేన్ మొహేబీ పేర్కొన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ జలసంధి ఇప్పుడు కేవలం ఒక జలమార్గం మాత్రమే కాదు, తమకు నిజమైన యుద్ధరంగమని వెల్లడించినట్లు ప్రకటించింది.


అమెరికాతో చర్చలు ప్రారంభించం : ఇరాన్ మంత్రి

ఇరాన్, అమెరికా మధ్య ప్రస్తుతం ఎటువంటి చర్చలూ జరగడం లేదని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ తెలిపారు. జూన్‌లో కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘిస్తున్నంత కాలం ఇరాన్‌ చర్చలను ప్రారంభించదని వాషింగ్టన్ ఉల్లంఘిస్తున్నంత కాలం టెహ్రాన్ చర్చలను ప్రారంభించదని అన్నారు. అయితే, మధ్యవర్తుల ద్వారా సందేశాల మార్పిడి మాత్రం జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. హార్ముజ్‌ జలసంధికి సంబంధించి ఇరాన్‌, ఒమన్‌ల మధ్య ఒప్పందం తుదిదశలో ఉందని అన్నారు. అయితే ఈ ఒప్పందంలో హార్ముజ్‌ జలసంధి వెంటనే తిరిగి తెరుచుకోదని తమ వైఖరిని పునరుద్ఘాటించారు. అమెరికా ఇతర షరతులన్నింటినీ అంగీకరించి, హార్ముజ్‌ తిరిగి తెరుచుకున్న తర్వాతే కొత్త నౌకాయాన మార్గాలను ఈ ఒప్పందం నిర్దేశిస్తుందని అన్నారు.


రక్షణ ఒప్పందంలో ఈజిప్ట్ చేరాలి : టర్కీ

పశ్చిమ ఆసియా యుద్ధంతో సతమతమవుతున్న ప్రాంతాన్ని స్థిరీకరించేందుకు, ప్రాంతీయ భాగస్వాములతో కుదిరే ఉమ్మడి రక్షణ ఒప్పందంలో ఈజిప్ట్ చేరాలని తాము ఆశిస్తున్నట్లు టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ తెలిపారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య నెలకొన్న యుద్ధం నేపథ్యంలో సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్‌లు శుక్రవారం ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ యుద్ధం పొరుగు దేశాలను కూడా ఈ వివాదంలోకి లాగడంతో పాటు, హార్ముజ్‌ జలసంధి, ఎర్ర సముద్రంల మీదుగా నౌకాయానానికి అంతరాయం కలిగించిందని అన్నారు. సౌదీ అరేబియాపై ఇరాన్‌, యెమెన్‌లోని హౌతీయులు దాడి చేశాయని అన్నారు. గత నెలలో మధ్యధరా సముద్రంలోని ఈజిప్టు ఓడరేవులో ఉన్న అమెరికా ఆస్తులపై డ్రోన్‌ దాడి జరిగిందని అన్నారు. ఈజిప్ట్ "మక్కా ఉమ్మడి రక్షణ ఒప్పందం"లో చేరాలని తాను ఆశిస్తున్నట్లు టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ తెలిపారు. ఈజిప్ట్‌ అన్ని విషయాల్లోనూ సహజ భాగస్వామి అని అభివర్ణించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్