సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

యుద్ధమా, దౌత్యమా దేనికైనా సిద్ధమే : ఇరాన్‌

57 నిమిషాల క్రితం

araghchi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 03:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

టెహ్రాన్‌ : యుద్ధమైనా, దౌత్యమైనా రెండింటిలో దేనికైనా సిద్ధమేనని ఇరాన్‌ సోమవారం స్పష్టం చేసింది. సంఘర్షణకు ముగింపు పలకాలని ఇరాన్‌ కోరుకుంటున్నప్పటికీ, చర్చలకు అమెరికా పట్ల విశ్వాసం లేకపోవడమే ప్రధాన అడ్డంకిగా ఉందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ తెలిపారు. అమెరికా మీడియాకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విశానకరమైన యుద్ధం సహా ఎటువంటి దురాక్రమణకైనా ఇరాన్‌ గట్టిగా ప్రతిస్పందిస్తుందని అన్నారు. ఇరాన్‌పై కొనసాగుతున్న దురాక్రమణను ముగించాలని ఇరాన్‌ కోరుకుంటోందని, అదే సమయంలో ప్రస్తుత అమెరికా ప్రభుత్వంతో తిరిగి చర్చలు జరపడం వలన ప్రయోజనమేమీ లేదని అన్నారు. దౌత్యంతోనే సమస్యలను పరిష్కరించుకోవచ్చని అరాగ్చీ అన్నారు. అయితే గత రెండేళ్లుగా అమెరికా ప్రవర్తన కారణంగా చర్చలను పునఃప్రారంభించడానికి లేదా ప్రభుత్వంతో సంప్రదించడానికి ఇరాన్‌కు పెద్దగా ప్రయోజనం లేదని అన్నారు. తరెండు దేశాలు దౌత్య సంబంధాలను కొనసాగిస్తున్న సమయంలోనే, 2025, 2026 సంవత్సరాలలో అమెరికా ఇరాన్ భూభాగంపై దాడి చేసిందని విదేశాంగ మంత్రి అన్నారు.

పున: చర్చల కోసం ఇరాన్‌ ప్రతిపాదన

గత వారం జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా, ఏడు రోజుల్లోగా హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని, అణు చర్చలను పునఃప్రారంభించాలని ఇరాన్ ప్రతిపాదించింది. బదులుగా, ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని, ఇరాన్ ముడి చమురుపై ఆంక్షలను నిలిపివేయాలని, కాల్పుల విరమణను పునరుద్ధరించాలని ఇరాన్‌ కోరింది. యుద్ధానికి బదులుగా శాంతిని నెలకొల్పేందుకే తాను, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ న్యూయార్క్‌కు వెళ్లినట్లు అరాగ్చి పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్