ఆదివారం, 08 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఘోర రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి

1 గంట క్రితం

accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026, 07:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

ప్రజాశక్తి - సియస్ పురం: సిఎస్పురం మండలం మైదుకూరు టు సింగరాయకొండ 167 బి నేషనల్ హైవే ఉప్పలపాడు స్టేజి వద్ద రెండు బైకులు ఎదురెదురు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. కడప జిల్లా బి కోడూరు మండలం ఐత్రం పేటకు చెందిన కొండా వెంకటసుబ్బారెడ్డి(23) సాఫ్ట్వేర్ ఇంజనీరు ప్రమాదస్థలంలోనే మృతిచెందగా, అతని మామ సిద్ధారెడ్డి కాలు విరిగినది. సిఎస్పురంకి చెందిన పాశం వెంకటేశ్వర్లు డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై పి వెంకటేశ్వర రెడ్డి ప్రమాద సంఘటన స్థలాన్ని చేరుకొని తీవ్రంగా గాయపడిన పాశం వెంకటేశ్వర్లు 108 అంబులెన్స్ లో ఒంగోలు తరలించారు సిద్ధారెడ్డిని స్థానిక ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. మృతి చెందిన కొండా వెంకట సుబ్బారెడ్డి అవివివాహితుడు కొత్తగా సాఫ్ట్వేర్ ఉద్యోగానికి కొలువు తీరినాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్