ఆదివారం, 08 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నక్సలైట్ల ముప్పు ఇంకా తొలగిపోలేదు.. 'దిమాగీ నక్సల్స్' చొరబడ్డారు

1 గంట క్రితం

pm modi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026, 07:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: దేశంలో సాయుధ నక్సలైట్లను నిర్మూలించినప్పటికీ, నక్సలిజం ముప్పు పూర్తిగా తొలగిపోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 'దిమాగీ నక్సల్స్' పేరుతో కొందరు వివిధ రాజకీయ పార్టీలు, సంస్థల్లోకి చొరబడ్డారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా కరణ్‌పూర్‌లో ఉన్న సీఆర్‌పీఎఫ్ క్యాంపులో భద్రతా సిబ్బందితో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. అటవీ ప్రాంతాల నుంచి సాయుధ నక్సలైట్లను తరిమికొట్టినప్పటికీ, ఇతర రూపాల్లో నక్సలిజం కొనసాగుతోందని మోదీ పేర్కొన్నారు. పలు సంస్థల్లోకి చొరబడిన వారు రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే, వివిధ సంస్థల్లోకి దిమాగీ నక్సల్స్ చొరబడ్డారన్న మోదీ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్