బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సిఎం, మంత్రి నారాయణలపై సిఐడి కేసు కొట్టివేసిన ఎపి హైకోర్టు

2 గంటల క్రితం

ap hc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 01:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : రాజధానిలోని అసైన్డ్‌ భూముల అంశంలో సిఎం చంద్రబాబు, మంత్రి నారాయణపై సిఐడి నమోదు చేసిన కేసును ఎపి హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌కు ఎలాంటి ఆధారాలు లేవంటూ.. ఈ కేసును హైకోర్టు తిరస్కరించింది. అసైన్డ్‌ భూముల్లో అవకతవకలు జరిగాయని వైఎస్ఆర్‌సిపి ప్రభుత్వ హయాంలో 2021 ఫిబ్రవరి 24న ఆళ్ల రామకృష్ణారెడ్డి సిఐడికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా ఎపి అసైన్డ్‌ భూముల బదిలీ నిరోధక చట్టం, ఐపిసి సెక్షన్ల కింద సిఎం చంద్రబాబు, మంత్రి నారాయణపై సిఐడి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్