శనివారం, 11 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

వియత్నంలో పడవ ప్రమాదం - మృతుల్లో కడప శ్రీధర్, మచిలీపట్నం జయశ్రీ

2 గంటల క్రితం

Boat accident in Vietnam – Kadapa’s Sridhar and Machilipatnam’s Jayasree among the deceased.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 05:16 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

వియత్నాం : వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో చనిపోయినవారిలో తెలుగువారు ఎక్కువగా ఉన్నారు. కడప కు చెందిన శ్రీధర్, మచిలీపట్నంకు చెందిన జయశ్రీ చనిపోయినట్లుగా ప్రాథమిక సమాచారం అందింది.


వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపం సమీపంలోని సముద్రంలో వాతావరణం అనుకూలించక, పెద్ద ఎత్తున అలలు రావడంతో ఈ స్పీడ్‌బోట్ బోల్తా పడినట్లు వియత్నాం కోస్ట్ గార్డ్ నిర్ధారించింది. ప్రమాద సమయంలో బోటులో మొత్తం 36 మంది ఉన్నారు. వీరిలో 32 మంది భారతీయ పర్యాటకులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు 15 మంది మరణించినట్లు స్థానిక అధికారులు ప్రకటించారు. 21 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా రక్షించగా.. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు.


మృతుల్లో తెలుగు వారి ప్రాథమిక వివరాలు ....


లావా మొబైల్స్ కంపెనీకి చెందిన దాదాపు 200 మంది డిస్ట్రిబ్యూటర్ల గ్రూప్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 50 మందికి పైగా ఉన్నారు. లభించిన తాజా సమాచారం ప్రకారం మృతుల్లో ఇద్దరు ఎపి వాసులు ఉన్నట్లు అధికారికంగా గుర్తించారు.


sridhar


1. శ్రీధర్ : ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన ప్రముఖ మొబైల్ డీలర్.


jayasri


2. జయశ్రీ : ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంకు చెందిన మహిళ.


ప్రమాదంలో మరణించిన జయశ్రీ భర్త కిషోర్ పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆయన స్థానిక వియత్నాం ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వీరు కాకుండా ఎపి, తెలంగాణకు చెందిన మరో నలుగురు నుంచి ఐదుగురు డీలర్లు ఇంకా గల్లంతయ్యారు. వారి కోసం సముద్రంలో గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.


సదరు బోటులో ఉన్న పర్యాటకులలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కు చెందిన లోకల్ మొబైల్ షాప్ ఓనర్లు, డీలర్లు , డిస్ట్రిబ్యూటర్లు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. లభించిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. గుంటూరు, విజయవాడ, వైజాగ్, వరంగల్, హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన లావా మొబైల్స్ రీటైలర్లు ఈ పర్యాటక బృందంలో ఉన్నారు. బోటు మునిగిపోయిన సమయంలో కొందరు సురక్షితంగా బయటపడగా, మరికొందరు గల్లంతయ్యారు. వియత్నాం కోస్ట్ గార్డ్ సిబ్బంది సముద్రంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. గల్లంతైన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఎంతమంది ఉన్నారనే కచ్చితమైన వివరాలు , చనిపోయిన వారి అధికారిక గుర్తింపు వివరాల కోసం స్థానిక వియత్నాం అధికారులు క్షేత్రస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు.


అప్రమత్తమైన భారత రాయబార కార్యాలయం.. హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల ...


ఈ ఘోర ప్రమాదంపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం తక్షణమే స్పందించింది. బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సమాచారం, అత్యవసర వైద్యం మరియు సహాయాన్ని అందించడానికి హో చి మిన్ సిటీ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. అలాగే హనోయిలోని ఎంబసీలోనూ మరో కంట్రోల్ రూమ్ అందుబాటులోకి వచ్చింది. బాధితుల వివరాల కోసం ఈ క్రింది నంబర్లలో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు:


హోచిమిన్ సిటీ కంట్రోల్ రూమ్ నంబర్లు ....

+84 36 281 7930 , +84 91 552 37 14 , +84 33 452 0414


హనోయి కంట్రోల్ రూమ్ నంబర్

+84 91 308 9165`


ఆందోళనలో మొబైల్ అసోసియేషన్స్ ...

వియత్నాం పర్యటనలో ఉన్న తమ తోటి వ్యాపార మిత్రులకు ప్రమాదం జరిగిందనే వార్త తెలియడంతో తెలుగు రాష్ట్రాల్లోని మొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయి. ప్రమాద తీవ్రత, గల్లంతైన వారి క్షేమ సమాచారం గురించి తెలుసుకోవడానికి లావా మొబైల్స్ ప్రతినిధులతో పాటు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల విదేశీ వ్యవహారాల విభాగాలను బాధితుల కుటుంబ సభ్యులు సంప్రదిస్తున్నారు. వియత్నాం ప్రభుత్వంతో మాట్లాడి సహాయక చర్యలను వేగవంతం చేయాలని, తెలుగు డీలర్లను సురక్షితంగా స్వదేశానికి రప్పించేలా కేంద్ర విదేశాంగ శాఖ చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. గల్లంతైన, మృతి చెందిన వారి పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్