కడప/వియత్నాం : వియత్నాంలో జరిగిన ఘోర పడవ ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో కడపకు చెందిన ప్రముఖ మొబైల్ ఫాన్స్ వ్యాపారి ముడియం శ్రీధర్ మృతి చెందారు. ఓ ప్రముఖ మొబైల్ సంస్థ తన రాష్ట్ర వ్యాప్త పంపిణీదారుల కోసం నిర్వహించిన విదేశీ పర్యటనలో భాగంగా వియత్నాంకు వెళ్లిన కడపకు చెందిన ప్రముఖ మొబైల్ వ్యాపారవేత్త ముడియం శ్రీధర్ ఈ ప్రమాదంలో మృతి చెందారు. కడపకు చెందిన ముడియం శ్రీధర్, నయిమ్‌తో కలిసి ఈ పర్యటనకు వెళ్లారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 25 నుంచి 28 మంది పంపిణీదారులు ఈ విహారయాత్రలో పాల్గొన్నారు. పర్యాటకులు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు భారతీయ పర్యాటకులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారేనని తెలుస్తోంది. ప్రమాద సమయంలో నయిమ్ సురక్షితంగా బయటపడగా, ఆయన అక్కడి పరిస్థితులను వీడియోల రూపంలో సామాజిక మాధ్యమాల ద్వారా పంపించారు.
వియత్నాంలో పడవ ప్రమాదం - కడప వ్యాపారి ముడియం శ్రీధర్ మృతి
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 11, 2026, 05:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)