శనివారం, 11 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మార్కెట్‌‌లోకి కొత్త బాబా

2 గంటల క్రితం

baba
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 06:35 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- వాటర్‌ బాబా అవతారమెత్తిన బిజెపి నాయకుడు

- క్యాన్సర్‌‌కు చికిత్స అంటూ మోసం చేస్తున్న వైనం

- పట్టించుకోని యోగీ సర్కార్‌

బరేలీ : మార్కెట్‌‌లో కొత్త బాబా రంగ ప్రవేశం చేశాడు. బిజెపి ఏలుబడిలోని ఉత్తరప్రదేశ్‌‌లో ఒక బాబా నీటి ట్యాంక్‌లో మునిగి మృతి చెందిన మూడేళ్ల బాలికపై "పవిత్ర జలం" చల్లి ఆమెను తిరిగి బతికించారు. అయనే ‘‘ బాటిల్‌బాబా’’ గా పేరుగాంచిన ఒమేంద్ర సింగ్‌. ఈ బాటిల్‌‌బాబా వైద్యశాస్ర్తానికే చెమటలు పట్టేలా, అనేక రోగాలను ఆయన పవిత్రజలంతో నయం చేశారు. అంతేకాదు పుట్టిన పసికందును సైతం పరీక్షిస్తారు. అంతకుమించి కేన్సర్‌ ‌వ్యాదులను సైతం నయం చేయడం ఆయన ప్రత్యేకత. ఇంతకి ఎవరూ ఈ బాటిల్‌ ‌బాబా. వివరాల్లోకి వెళ్తే

ఎవరీ ఓమేంద్ర సింగ్ చౌహాన్?

బరేలీలోని ఒక రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించిన ఓమేంద్ర సింగ్ చౌహాన్ గతంలో ఫార్మా ఉద్యోగిగా, రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమకారుడిగా పనిచేశారు. 2016 నుంచి 2021 వరకు బిజెపికి చెందిన "భారతీయ ఖండ్ మంచ్" జాతీయ అధ్యక్షుడిగా పని చేశారు. అయితే 2021లో కోవిడ్ కాలంలో ఆయనలో ఒక "ఆధ్యాత్మిక మేల్కొలుపు" చోటుచేసుకుందని చెబుతూ, రాత్రికి రాత్రే మహంత్‌గా, "దేవుని దూత"గా మారిపోయారు. బరేలీలోని ఆవ్లా తహసీల్‌లో ఉన్న మనౌనా ధామ్, ఖాటూ శ్యామ్‌జీకి అంకితం చేసిన ఆలయంలో ఈ బాబా కార్యకలాపాలు సాగుతున్నాయి.. ఇక్కడ ఒక హ్యాండ్‌పంప్ నుంచి తీసిన పవిత్ర జలంతో క్యాన్సర్ (స్టేజ్-4 సహా), పక్షవాతం, వంధ్యత్వం వంటి అసాధ్య వ్యాధులను నయం చేయగలనని చౌహాన్ ప్రచారం చేస్తున్నారు. వీడియో కాల్స్ ద్వారా కూడా ఈ "చికిత్స" అందిస్తానని చెబుతున్నారు. అయితే దీనికోసం భక్తుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడం, దోపిడీ చేయడం, హింసాత్మక ప్రవర్తించడం ఆయన నైజం. ఇటీవల మహారాష్ట్రలోని నాశిక్‌లో, ఆయన పోలీస్ కమిషనర్ కార్యాలయంలోకి వెళ్లి అక్కడ పూజలు నిర్వహించారు, దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాలని అంధశ్రద్ధా నిర్మూలన కమిటీ డిమాండ్‌ ‌చేసింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో వీడియోల ద్వారా తీవ్రమైన, అసాధ్య వ్యాధులను "మంత్రించిన నీరు" ద్వారా నయం చేయగలనని ఆయన ప్రచారం చేస్తున్నారని, మానసిక వ్యాధులను నయం చేయడం, చనిపోయిన వారిని కూడా బతికించడం వంటి అశాస్త్రీయ, అద్భుత దావాలు చేస్తున్నారని ఆ సంస్థ ఫిర్యాదు చేసింది. అయితే, ఈ వాటర్‌ ‌బాబాపై యోగీ ప్రభ్వుత్వం చర్యులు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్