శనివారం, 11 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పడవ ప్రమాదంపై భారత ఎంబసి అధికారులతో మాట్లాడిన మంత్రి లోకేష్

1 గంట క్రితం

Minister Lokesh spoke with Indian Embassy officials regarding the boat accident.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 05:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : వియత్నాంలో పర్యాటక బోటు బోల్తా పడిన ఘటనలో ఎపి వాసులు మృతి చెందిన ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. వియత్నాంలోని భారత ఎంబసీ అధికారులతో మాట్లాడి భాధితులకు తక్షణ సాయం అందేలా చూడాలని కోరారు. ప్రమాదంలో చిక్కుకున్న తెలుగువారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. బాధితులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసానిచ్చారు. మరోవైపు ఢిల్లీలోని ఎపి భవన్‌ అధికారులతోనూ మంత్రి లోకేష్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వియత్నాంలోని భారత ఎంబసీతో మాట్లాడుతున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో బాధితులకు సాయం అందించాలని లోకేష్ సూచించారు. బాధితుల సమాచారం కోసం అక్కడి ప్రభుత్వం కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసింది. +84 362817930, +84 915523714, +84 334520414, +84 913089165 నంబర్లలో సంప్రదించాలని కోరింది. పడవ ప్రమాద ఘటనలో మొత్తం 15 మంది మృతి చెందగా.. 21 మంది అస్వస్థతకు గురయ్యారు. వియత్నాంలోని ఫూ క్వాక్‌ ద్వీపం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మొబైల్‌ కంపెనీ భారత్‌కు చెందిన డిస్ట్రిబ్యూటర్ల కుటుంబాలను వియత్నాం పర్యటనకు తీసుకెళ్లింది. మొత్తం 250 మందిని తీసుకెళ్లగా.. అందులో ఎపి కి చెందిన 35 మంది, తెలంగాణకు చెందిన 40 మంది ఉన్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసింది. బోటు ప్రమాదానికి సంబంధించిన సమాచారం, రాష్ట్రం నుంచి వియత్నాం పర్యటనకు వెళ్లినవారి వివరాలను 9885371189, 7997959754, 9989654807, 7997959779 నంబర్లకు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చని ప్రకటన విడుదల చేసింది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్