ప్రజాశక్తి-అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) గడువును జూలై 24 వరకు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం పట్ల సిపిఎం రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓటర్లకు సరైన అవగాహన లేకపోవడం, అవసరమైన పత్రాలను సమర్పించడానికి మరింత సమయం పడుతుందనే ఉద్దేశంతో గడువును పొడిగించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ గతంలోనే ఎన్నికల సంఘాన్ని కోరింది. అందుకు అనుగుణంగా స్పందించి గడువు పెంచడం వల్ల ఓటర్లు తమ ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించడానికి తగిన అవకాశం లభిస్తుందని పార్టీ భావిస్తోంది. అయితే, ఇప్పటికీ లక్షలాది ఫారాలు తిరిగి రావాల్సి ఉన్నందున, అవసరమైతే ఈ గడువును మరికొంత కాలం పొడిగించాలని కోరుతోంది. ఎన్నికల సంఘం ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా, ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా పారదర్శకంగా, వివక్ష రహితంగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహించాలని సిపిఎం డిమాండ్ చేస్తోంది. సాంకేతిక కారణాలను చూపుతూ ఎవరి ఓటు హక్కునూ తిరస్కరించకూడదని, రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరుతోంది.
ఎస్ఐఆర్ ప్రక్రియ గడువు పొడిగింపు హర్షణీయం: సిపిఎం
6 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 14, 2026, 06:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)