శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నేటి నుంచి పాపికొండల బోటింగ్ పునఃప్రారంభం

2 గంటల క్రితం

papikondalu-boating
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 07:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రాజమండ్రి : భద్రతా కారణాల దృష్ట్యా సుమారు 20 రోజులుగా నిలిచిపోయిన ప్రసిద్ధ పాపికొండల బోటింగ్ యాత్రకు అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. శనివారం నుంచి రాజమండ్రి పుష్కర ఘాట్‌, భద్రాచలంతో పాటు దేవీపట్నం మండలం గండి పోచమ్మ ఆలయం నుంచి ఈ విహార యాత్రలు తిరిగి ప్రారంభం కానున్నాయి. గత నెల జూన్ 14న ఒక పర్యాటక బోటులో సాంకేతిక లోపం తలెత్తడంతో అధికారులు సేవలని తాత్కాలికంగా నిలిపివేసి, క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం జాయింట్ కలెక్టర్, ఆర్డీవో నేతృత్వంలోని అధికారుల బృందం భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, అన్ని నిబంధనలు సక్రమంగా ఉన్నాయని ధ్రువీకరించిన తర్వాతే 15 ప్రైవేట్ బోట్లతో పాటు ఏపీటీడీసీ (APTDC) బోటుకు అనుమతులు మంజూరు చేసింది. వర్షాకాలంలో పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, కఠినమైన నిబంధనల నడుమ ఈ సేవలను కొనసాగించనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్