మియామి హార్డ్‌రాక్ స్టేడియంలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా 3-2 తేడాతో కాబో వెర్డెపై ఘన విజయం సాధించి రౌండ్ ఆఫ్-16లోకి అడుగుపెట్టింది. ఆట 29వ నిమిషంలో లియోనల్ మెస్సీ గోల్‌తో అర్జెంటీనాకు తొలి ఆధిక్యం లభించగా, రెండో అర్ధభాగంలో కాబో వెర్డె ఆటగాడు డెరోయ్ డువార్టే (59వ నిమిషం) గోల్‌తో స్కోరును సమం చేశాడు. నిర్ణీత 90 నిమిషాల్లో విజేత తేలకపోవడంతో మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్ వెళ్లింది. అక్కడ అర్జెంటీనా తరఫున లిసాండ్రో మార్టినెజ్ (93వ నిమిషం), క్రిస్టియన్ రొమెరో (111వ నిమిషం) గోల్స్ చేయగా.. కాబో వెర్డె నుంచి లారోస్ కాబ్రాల్ (103వ నిమిషం) ఒంటరి పోరాటం చేశాడు. చివరి నిమిషాల్లో కాబో వెర్డె చేసిన దాడులను అర్జెంటీనా గోల్‌కీపర్ ఎమిలియానో మార్టినెజ్ సమర్థవంతంగా అడ్డుకోవడంతో అర్జెంటీనా విజయం ఖరారైంది.
FIFA World Cup:ఉత్కంఠ పోరులో కాబో వెర్డెపై అర్జెంటీనా విజయం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 04, 2026, 07:38 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు




కామెంట్‌లు (0)