శనివారం, 18 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

చివరి నిమిషంలో ఆగిన వ్రికమ్‌ 1 రాకెట్‌ ప్రయోగం..

1 గంట క్రితం

sriharikota
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 18, 2026, 11:35 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-శ్రీహరికోట: స్కైరూట్‌ ఏరోస్పేస్‌ రూపొందించిన భారత తొలి ప్రైవేట్‌ ఆర్బిటల్‌ రాకెట్‌ ‘విక్రమ్‌-1’ ప్రయోగం మిషన్‌ ‘ఆగమన్‌’ ప్రయోగానికి చివరి నిమిషంలో అంతరాయం ఏర్పడింది.  శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 11.30 గంటలకు ప్రయోగం జరగాల్సి ఉండగా.. సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ప్రయోగాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రయోగానికి ముందు తనిఖీల్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో భద్రతా కారణాల దృష్ట్యా కౌంట్‌డౌన్‌ను ఆపినట్లు సమాచారం. అయితే సమస్యను పరిశీలించిన అనంతరం మధ్యాహ్నం 12:05 గంటలకు రాకెట్‌ ప్రయోగం జరగనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్