ప్రజాశక్తి-విశాఖ : విశాఖపట్నంలోని తూర్పు నావికాదళం పరిధిలోకి సరికొత్త యుద్ధనౌక ఐఎన్‌ఎస్ ‘మహేంద్రగిరి’ అధికారికంగా చేరింది. శనివారం విశాఖ నేవల్ డాక్‌యార్డ్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీనిని ప్రారంభించి, నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వదేశీ నైపుణ్యంతో రూపుదిద్దుకొని సేవలందించేందుకు మహేంద్రగిరి సిద్ధమైందన్నారు. శత్రు రాడార్లకు చిక్కకుండా కడలిలో దూసుకుపోవడం దీని ప్రత్యేకతని తెలిపారు. భవిష్యత్తులో యుద్ధాల స్వభావం పూర్తిగా మారిపోతోందని.. డ్రోన్లు, సైబర్ దాడుల రూపంలో సవాళ్లు ఎదరయ్యే ప్రమాదం ఉందన్నారు. సాంకేతికంగా ఇంకా బలంగా ఉండేలా నూతన ఆవిష్కరణలకు ప్రణాళికలు రూపొందిస్తున్నమని తెలిపారు. భవిష్యత్తులోనూ మరిన్ని ఆవిష్కరణలు రాబోతున్నాయని తెలిపారు.
తూర్పు నావికాదళంలోకి అత్యాధునిక యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి’
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 11, 2026, 11:14 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)