గుంటూరు : ఉండవల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శనివారం ఉదయం సిఆర్డిఎ సిబ్బంది.. జేసీబీల సాయంతో వచ్చి తమ పంటలను ధ్వంసం చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు.. రైతులను బలవంతంగా లాక్కెళ్లారు. మహిళా రైతులను ఈడ్చుకెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. తమ భూములను అన్యాయంగా లాక్కుంటున్నారంటూ రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనికిముందు.. సిఆర్డిఎ అధికారులు భూసేకరణ పేరుతో తమ ఇండ్లకు వచ్చి నోటీసులు ఇచ్చి వెళ్లారని, ఇప్పుడు తమ పంటలను ధ్వంసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉండవల్లిలో ఉద్రిక్తత .. పంటలు విధ్వంసం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 11, 2026, 12:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)