ఢిల్లీ : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 2026 జూలై 18న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నిరాహార దీక్ష చేపట్టారు. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను ఢిల్లీ పోలీసులు ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. “ఇప్పటి నుంచే నేను నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నాను” అని ఆయన ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో తెలిపారు.
ఇదిలా ఉండగా, సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు, నిపుణుల వైద్యుల సూచనల మేరకు అవసరమైన వైద్య చికిత్స కోసం ఆయనను ఆసుపత్రికి తరలించినట్లు న్యూఢిల్లీ డీసీపీ కార్యాలయం వెల్లడించింది. పోలీసుల చర్యల అనంతరం, జంతర్ మంతర్ వద్ద నిరసనకారులపై పోలీసులు చేపట్టిన చర్యల్లో తనపై దాడి చేశారని, తనను అదుపులోకి తీసుకున్నారని అభిజీత్ దీప్కే ఆరోపించారు. అయితే, నిరసనకారులు శాంతియుతంగా స్థలాన్ని ఖాళీ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.







కామెంట్‌లు (0)