మంగళవారం, 04 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

భారీ కుదుపులకు గురైన ఎయిరిండియా విమానం

11 గంటల క్రితం

Air India
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 04, 2026, 02:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఎయిరిండియా విమానం ఆకాశంలో భారీ కుదుపులకు గురవడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. మంగళవారం న్యూఢిల్లీలో ఈ ఘటన జరిగింది. వివరాల ప్రకారం.. థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌ నుండి న్యూఢిల్లీకి ప్రయాణిస్తున్న ఎయిరిండియా విమానం గాలిలో కుదుపులకు గురైంది. అనంతరం విమానం ఢిల్లీలో సురక్ష‍ితంగా ల్యాండ్‌ అయింది. టెర్మినల్ గేట్ బయట అంబులెన్స్‌లు సిద్ధంగా ఉండటం, పలువురు ప్రయాణికులు వీల్ చైర్ల సహాయంతో బయటకు రావడం, మరికొందరు తలలకు బ్యాండేజ్‌తో వైద్య పరీక్షల కోసం వెళుతున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఢిల్లీకి వెళ్తుండగా ఎఐ2379 విమానం ప్రయాణ సమయంలో గాలిలో అస్థిరత కారణంగా కుదుపులకు గురైనట్లు ఎయిరిండియా ప్రతినిధి వెల్లడించారు. ప్రయాణికులు, సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయని, మెరుగైన చికిత్స కోసం వారిని విమానాశ్రయంలోని ఆస్పత్రికి తరలించామని అన్నారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్