లక్నో : గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపి అతీక్ అహ్మద్ చిన్న కుమారుడు అబాన్ అహ్మద్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో గురువారం అబాన్, ఆయన స్నేహితులు ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొందని, ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైందని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. అబాన్‌తో పాటు మరో స్నేహితుడు అక్కడికక్కడే మరణించారని అన్నారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని, వారికి ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం డివైడర్‌ని ఢీకొట్టిందని అన్నారు. జైల్లో ఉన్న తన సోదరుడిని కలిసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అన్నారు.
రోడ్డు ప్రమాదంలో అతీక్ అహ్మద్ కుమారుడు మృతి
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 06, 2026, 02:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)