సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్నేహితులతో వెళ్లిన మైనర్‌ బాలికపై అత్యాచారం.. హత్య

3 రోజుల క్రితం

minor girl
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 12:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : స్నేహితులను నమ్మి వారితో వెళ్లిన మైనర్‌ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన ఉత్తర ఢిల్లీలోని స్వరూప్‌ నగర్‌లో వెలుగుచూసింది. సెప్టెంబర్‌ 13న బహిరంగ ప్రదేశంలో కుళ్లిన స్థితిలో బాలిక మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు శివం (19)తో పాటు మరో ముగ్గురు మైనర్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు, బాలిక ఒకరికొకరు పరిచయస్తులేనని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి 72 గంటల్లో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఘటనకు సంబంధించి రెండు కత్తులు, నిందితుల దుస్తులు, టెంపోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్