న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ ఆదివారం జరగనుంది. దేశంలోని 551 నగరాల్లోని 5,440 కేంద్రాల్లో, విదేశాల్లోని 14 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షకు 22.79 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.15 గంటల వరకు జరగనున్న నీట్ - యుజి రీ ఎగ్జామ్ కోసం భద్రతను కట్టుదిట్టం చేశారు.
పరీక్ష ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎటువంటి ఆందోళన లేకుండా, నిర్భయంగా హాజరుకావాలని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్ టి ఎ) , రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు, విద్యా వేత్తలు, విద్యార్థులకు తనకు పూర్తి విశ్వాసం ఉందని ఆయన అన్నారు.
'పేపర్ లీక్' కారణంగా ఈ పరీక్షను మరోసారి నిర్వహిస్తున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ పలువురిని అరెస్టు చేసింది.









కామెంట్‌లు (0)