mh ad
ఆదివారం, 21 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రకృతితో ముడిపడిన జీవనం

2 గంటల క్రితం

prakruti
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 21, 2026, 02:26 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

వర్షాకాలం ప్రారంభంలో, వ్యవసాయ పనులు మొదలుపెట్టే ముందు భూమి పండుగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు. గూడెంలోని పురుషులంతా కలిసి అడవికి వేటకు వెళ్తారు. వేట ముగిసిన తర్వాత అందరూ కలిసి సామూహిక భోజనాలు చేస్తారు.

మామిడి పండుగ వేసవి కాలంలో చెట్లకు కాసే మొదటి మామిడికాయలను ఇష్టదైవానికి, ప్రకృతికి నివేదించిన తర్వాతే వీరు తింటారు.

గిరిజన ఆచారాలు ఎప్పుడూ ప్రకృతితోనే ముడిపడి ఉంటాయి. అడవిని దైవంగా, చెట్లను, జంతువులను తమ తోబుట్టువులుగా భావిస్తారు. పండుగలకు ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. జున్‌, జూలై నెలలో వచ్చే పండుగల ప్రత్యేకతను తెలుసుకుందాం. కొండకోనల్లో కోలాహలం దట్టమైన అడవుల్లో భూమి పండగ రోజు తెల్లవారుజామునే పక్షుల కిలకిలరావాలతో పాటు కొమ్ము బూరల శబ్దం చేస్తూ , కోనల్లో నుండి భూదేవిని తీసుకొని వచ్చి అలంకరిస్తారు, అది కేవలం ఒక పండుగ కాదు, గిరిజన గూడెం అంతా కొత్త బట్టలు, పసుపు, కుంకుమల సువాసనలతో అలకరించుకొంటారు. ఆ ఊరి పెద్దాయన ప్రజలకు ఈ పండుగ గురించి వివరిస్తాడు.


samskruti


ప్రకృతియే దైవం గిరిజన పండుగలకు, సాధారణ పండుగలకు చాలా తేడా ఉంటుంది. ఇక్కడ ఎలాంటి రాతి విగ్రహాలు ఉండవు. ప్రకృతిలో లభించే వస్తువులనే దైవంగా భావిస్తారు. సామూహిక నృత్యాలు : పండుగలో ఢింసా, రేలా వంటి నృత్యాలు చేస్తారు. ఇవి కేవలం వినోదం కోసం కాదు, గూడెంలోని అడవి బిడ్డల పడిపంటలకోసం. నేటి తరానికి సందేశం గిరిజన పండుగలు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాయి. ఆధునిక ప్రపంచం ప్రకృతిని నాశనం చేస్తుంటే, గిరిజనులు మాత్రం పండుగల ద్వారా ప్రకృతిని ఎలా రక్షించాలో చూపిస్తారు. చెట్లను పూజించడం, వన మూలికలను గౌరవించడం ద్వారా వారు పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్నారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని గిరిజన తెగలైన కోయ, గొండ్, చెంచు తెగల జీవన విధానం, వారి విశిష్టమైన పండుగలు ఇవి. ఈ పండుగలు కేవలం వినోదం కోసమే కాకుండా, ప్రకృతిని గౌరవించడానికి, తమ పూర్వీకులను స్మరించుకోవడానికి జరుపుకుంటారు.

టివిఆర్‌

9490099424

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్