శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

5వ రోజు - దస్తావేజు లేకర్ల పెన్ డౌన్

1 గంట క్రితం

Day 5 – Document Writers' Pen-Down Strike
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 02:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-చంద్రగిరి (తిరుపతి) : రాష్ట్రవ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమం కొనసాగుతుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు, ఆపరేటర్లు నిరసన కార్యక్రమం ఐదవ రోజు శుక్రవారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ..... ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సౌకర్యాలు ఆర్ ఎస్కే కేంద్రాల ద్వారా కల్పిస్తామని చెబుతున్నప్పటికీ, ఆ సౌకర్యాలు అన్ని ఇప్పటికే అందుబాటులో ఉన్నాయన్న విషయం ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు పోరుబాట పట్టారన్నారు. స్థిరస్తుల రిజిస్ట్రేషన్ పక్రియను ప్రైవేటీకరణ చేయవద్దని, ఇది ప్రజల తరతరాల ఆస్తులకు సంబంధించిన సున్నితమైన విషయమని వారు స్పష్టం చేశారు. ప్రైవేటుకు చేయబోమని చెబుతూనే ప్రభుత్వం జీవోల రూపములో తమను మభ్యపెడుతున్నట్లు తెలిపారు. 396 జీవో వలన లక్షకు పైగా డాక్యుమెంట్ రైటర్ల కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి డాక్యుమెంట్ రైటర్స్ కు వ్యతిరేకంగా విడుదల చేసిన జీవో 396 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి డాక్యుమెంట్ రైటర్స్, స్టాంప్ వెండర్స్, ఆపరేటర్లు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్